బోనకల్లు, ఆగస్టు 15 : వరద నీటితో బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం చెరువును తలపిస్తున్నది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచి చెరువును తలపిస్తుంది. భారీగా నిలిచిన వర్షపు నీటితో విద్యార్థినులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన చేతిపంపులు సైతం నీటిలో మునిగి పోయాయి. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో దుర్వాసన మొదలడవడమే కాకుండా దోమలు సైతం విజృంభిస్తున్నాయి. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి విద్యాలయంలో నిలిచిన నీటిని తొలగించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.
Bonakal : చెరువును తలపిస్తున్న బోనకల్లు కేజీబీవీ