అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువైపు నిలవాలో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని, ఆత్మగౌరవాన్నే కోరుకుంటున్నారని అన్నారు.
- ఎటువైపు నిలవాలో ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు తెలుసు
- కాంగ్రెస్ అభ్యర్థి ‘తుమ్మల’ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
- నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు
- ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువైపు నిలవాలో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఇక్కడి ప్రజలు అభివృద్ధిని, ఆత్మగౌరవాన్నే కోరుకుంటున్నారని అన్నారు. ఖమ్మంలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన.. పలు డివిజన్లలో నగర ప్రముఖులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు హాజరయ్యారు. 45వ డివిజన్ మామిళ్లగూడెంలో శాబాసు శ్రీను, అమృతసాయి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. ఇన్నేళ్లూ ఎక్కడా కన్పించని తుమ్మల నాగేశ్వరరావు.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం ప్రజల ముందుకు వచ్చారని విమర్శించారు. పైగా దర్జాలు ప్రదర్శిస్తూ తనపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మంత్రిగా ఉండి గడిచిన ఐదేళ్లలో ఖమ్మంలో తాను చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉందని అన్నారు.
సంక్షేమ పథకాల ఫలాలను కూడా ఇంటింటికీ తిరిగి అందించానని గుర్తుచేశారు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఇన్నాళ్లూ కనీసం కంటికి కూడా కనిపించకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ధంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జి, నూతన బస్టాండ్, ఐటీ హబ్, గోళ్లపాడు ఛానల్, పారులు, రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను పూర్తి చేసిన విషయం ఖమ్మం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కానీ ఇన్నాళ్లూ ఏ మూలనో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మమొచ్చి అవన్నీ ఆయన చేసినట్లుగా చెప్పుకుంటుండడంతో సిగ్గుచేటని అన్నారు. కనీస జ్ఞానం లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి తంతు చూస్తుంటే.. పక్క వాడికి జన్మించిన బిడ్డను కూడా తనకు జన్మించినట్లుగా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలా కన్పిస్తోందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, బుడిగెం శ్రీనివాస్, పగడాల నాగరాజు, జకుల లక్ష్మయ్య, శీలంశెట్టి వీరభద్రం, వల్లూరి విజయ్, మహేశ్, జయంత్, నాగరాజు, పసుపులేటి కవిత, బుడిగెం బద్రమ్మ, ఆకుల చంద్రకళ, నర్రా నాగమణి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

