జూలూరుపాడు : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) జన్మదిన వేడుకలను ( Birthday Celebrations) జూలూరుపాడు బీఆర్ఎస్ మండల నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ నివాసంలో కేక్‌ను యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు కలిసి కట్ చేసి పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనహృదయ నేతగా పేరుగాంచిన పువ్వాడ అజయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో కూడా ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తితో పాటు నాయకులు యదలపల్లి వీరభద్రం, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, సాయిల నాగేశ్వరరావు, తాళ్లూరి రామారావు, పురస్తపురవు రామకృష్ణ, బానోత్ హనుమంతరావు, బండారి వెంకయ్య, లకావత్ గణేష్, బానోత్ రవి, ఈసాల వెంకటేష్ , పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.