ఖమ్మం, ఏప్రిల్ 4: ఖమ్మం ఔన్నత్యాన్ని కాపాడడంలో ఎల్లప్పుడూ ముందుంటానని, పదేండ్లు ప్రజలిచ్చిన అవకాశంతో ఖమ్మం నియోజకవర్గ చరిత్రలో లేనివిధంగా పనిచేశానని, చాలా సంతృప్తిగా ఉన్నానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని షాదీఖానా ఆవరణలో శుక్రవారం జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతి సందర్భంలోనూ ఖమ్మంలో తనకంటే ముందు పనిచేసిన ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకొని మసలుకుంటానన్నారు.
ఖమ్మం నగరానికి ఖిల్లా ఎంత గట్టిగా ఉందో తన మనస్సులో అల్లా కూడా అదేవిధంగా ఉంటారని అన్నారు. పీస్ కమిటీ చైర్మన్ జడ్ సుధాకర్, సీనియర్ న్యాయవాది కొల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ మక్బుల్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, మైనార్టీ విభాగ అధ్యక్షుడు తాజుద్దీన్, మతపెద్దలు ఆఫీజ్, ఘనీ, సుజాఉద్దీన్ పాల్గొన్నారు.