– అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు
ఖమ్మం రూరల్, జనవరి 28 : నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని డిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ సిబ్బందికి సూచించారు. బుధవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, సీసీటీఎన్ఎస్ అప్లోడ్, జనరల్ డైరీ రికార్డులు, సీజ్ చేసిన వాహనాలు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, హిస్టరీపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో అవగాహన ఉండాలని సెక్టర్ పోలీస్ ఆఫీసర్లకు సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, పెండింగ్ కేసులు పరిశీలించారు. విధిగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. పాత నేరస్ధుల కదలికలపై నిఘా పెట్టాలని పేర్కొన్నారు.