కారేపల్లి, డిసెంబర్ 19 : పంచాయితీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తప్పి సొంత పార్టీ వాళ్లే మోసం చేశారంటూ వార్డు సభ్యుడిగా గెలుపొంది ఉప సర్పంచ్ పదవిని ఆశించిన వార్డు మెంబర్లు గ్రామ దేవత ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని పేరుపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పేరుపల్లి గ్రామ పంచాయతీలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా గెలుపొందిన బోళ్ల రమేశ్ తనకు ఉప సర్పంచ్ పదవిని ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలో గల గురవమ్మ తల్లి దేవాలయం ముందు మరో ముగ్గురు వార్డు సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు.