Minister Pongileti | ఖమ్మం : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం నిరసన తగిలింది. మండల పర్యటనలో భాగంగా పాతర్లపాడులో రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన చేశాడు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అవకతవకలపై ప్రజలు మంత్రి పొంగిలేటిని నిలదీశారు. అసలైన నిరుపేదలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ధనవంతులు, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని ప్రజలు ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.