e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home ఖమ్మం Property show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి ఖమ్మంలో ప్రాపర్టీ షో..

Property show | నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి ఖమ్మంలో ప్రాపర్టీ షో..

ఖమ్మం: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. నగరంలోని రాజ్‌పద్ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటుచేయనున్నఈ షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాపర్టీ షో జిల్లాలో మొదటి సారి నిర్వహిస్తుండటంతో నూతన గృహాలు, ఇండ్ల స్ధలాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే వేదికపై లభించనున్నది.

- Advertisement -

జిల్లాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధలు, భవన నిర్మాణంలో అపార అనుభవం ఉన్నబిల్డర్లు ఈ ప్రాపర్టీషోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు.

అలాగే ఇండ్ల స్ధలాలు, భవనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు నిబంధనలకు లోబడి రుణ సదుపాయం కల్పించేందుకు పలు జాతీయ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొననున్నాయి. ఈ నెల 24వ తేది ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర, జిల్లా ప్రజా ప్రతినిధులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు ప్రముఖులు పాల్గొంటారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement