– ప్రదానం చేసిన ప్రముఖ ఎట్ టెక్ సంస్థ
– అవార్డు అందుకున్న ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు
ఖమ్మం రూరల్, డిసెంబర్ 13 : దేశంలోని విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయికి చేరుకుని సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంస్థలను గుర్తించి వాటికి అరుదైన గౌరవం ఇస్తున్న విద్యా శిక్షణా రంగ సంస్థ ఎట్ టెక్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరానికి గాను హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రియదర్శిని విద్యా సంస్థలు దక్కించుకున్నాయి. శనివారం హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డును ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు అందుకున్నారు. తమ 25 సంవత్సరాల నిరంతర కృషికి, విద్యార్థిని విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దిన విధానాలకు దక్కిన గుర్తింపుగా తాము ఈ అవార్డును స్వీకరిస్తున్నామని తెలుపుతూ నవీన్ బాబు హర్షం వ్యక్తం చేశారు.
తమను నమ్మి వచ్చిన ప్రతి విద్యార్థులు అత్యున్నత స్థాయిలో స్థిరపడటానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం వల్లే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు అత్యున్నత స్థితిలో ఉన్నారని, అలాంటి తమ కృషికి పురస్కారం లభించడంపై విద్యా సంస్థల డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పురస్కారం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్ అన్నారు. అవార్డు స్వీకారంపై డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ వి.రామారావు, నయీం పాషా, డైరక్టర్ శ్రీ రామినేని, చలపతిరావు, అకడమిక్ డైరెక్టర్ ఎం.శివకుమార్, వివిధ విభాగాల హెచ్.ఓ.డిలు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తమ సంస్థ సాధించిన మైలురాయికి ఆనందం వ్యక్తం చేశారు.