ఒకటి.. రెండు తడులకు నీరు ఇవ్వగలం
ఎగువన సాగర్ డ్యాం డెడ్ స్టోరేజీకి వచ్చినందున జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టుకు ఒకటి.. రెండు తడులకు తప్ప సాగునీరు సరఫరా చేయలేమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
- రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి
కూసుమంచి, జనవరి 17: ఎగువన సాగర్ డ్యాం డెడ్ స్టోరేజీకి వచ్చినందున జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పాత కాలువ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి మండలాల ఆయకట్టుకు ఒకటి.. రెండు తడులకు తప్ప సాగునీరు సరఫరా చేయలేమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆయకట్టు రైతులు బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి సాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..
పంటలకు సరిపడినంత సాగుజలాలు సరఫరా చేయాలని ప్రభుత్వానికీ ఉందన్నారు. ఒకవేళ నీరు ఇస్తామని మాట ఇస్తే, రైతులు ఆశలు పెట్టుకుని నాట్లు పూర్తి చేస్తారన్నారు. కానీ ఆ తర్వాత సర్కార్ నీరు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారన్న ఆలోచనతో ఒకటి రెండు తడులకు తప్ప నీరు ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నామన్నారు. రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ నీరు విడుదలైతే ఆ నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. త్వరలోనే నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

