మధిర, ఆగస్టు 02 : మధిర పట్టణంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ అనిల్ కుమార్ నెహ్రూ పూలమాల వేసి నివాళి అర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.రమేశ్‌బాబు మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య బహు భాషా పండితుడని, గొప్ప దేశభక్తి వాది అని కొనియాడారు. పింగళి వెంకయ్య మన తెలుగు వాడు కావడం మనకెంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.