మధిర, మే 05 : వేసవి సెలవుల్లో ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు. సోమవారం మండలంలోని లచ్చేగూడెం భవిత కేంద్రాన్ని అయన పరిశీలించి మాట్లాడారు. మండల పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా క్యాంప్ ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతుందన్నారు. ప్రతి బుధవారం జరిగే ఈ ఉచిత వైద్యశిబిరం లచ్చగూడెం బాల బాలికల భవిత కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లచ్చగూడెం, భవితా కేంద్రం నిర్వాహకులు కే.ఎస్. కృష్ణారావు, ఐఆర్పీ భూక్యా దస్లి, సీసీఓ సైదులు, సీఆర్పీలు పద్మజ, నిర్మల పాల్గొన్నారు.