బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. బుధవారం ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరల నుంచి సూరీడి జాడ కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఉదయం వాహ నదారులు లైట్లు వేసుకొని మరీ ప్రయాణిస్తుండగా.. బాటసారులకు సైతం ఎదుటివారు కనిపించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల చలి తీవ్రతను తట్టుకోలేక చలిమంటలు కాగుతున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్నది.