కారేపల్లి,ఫిబ్రవరి 22 : స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ జెడ్పిటిసి వాంకుడోత్ జగన్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మండలానికి చెందిన ప్రముఖ వైద్యుడు బాదావత్ రవి(న్యూరో రిహబ్ ఎడ్యుకేటర్)ఆధ్వర్యంలో మిషన్ వాక్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారంl ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కారేపల్లి, భాగ్యనగర్ తండా సర్పంచ్లు మేదరి వీర ప్రతాప్(టోనీ), బానోత్ హీరాలాల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద సేవా సంస్థల వారు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో నాయకులు అడ్డగోడ ఐలయ్య, అజ్మీర వీరన్న, యాకుబ్ అలీ, తాజుద్దీన్, వైద్యులు కళ్యాణ్ శ్రీనివాస్, ఆదేశ్,వాలా, బాసిత్, సుమిత్, అకృత్ కుమార్, సామ్యూల్ రాజు, నతీష్, అను, సుమన్, మురళి, శివకుమార్, షాలోని, హాసరా, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.