తల్లాడ, నవంబర్13: కాంగ్రెస్ పార్టీ చెప్పే ఆరు గ్యారేంటీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడ మెయిన్‌రోడ్డులో షాపు టూ షాపు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రతి షాపు, గడపగడపకు తిరుగుతూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి మూడుసార్లు ఆదరించి గెలిపించారని, ఒక కార్యకర్తలాగా పనిచేసి నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా, నిత్యం మీతోనే ప్రజల మధ్యనే ఉన్నానని, ఎన్నికలప్పుడు మాత్రమే కనబడే వ్యక్తి నేను కాదన్నారు. కొంతమంది ఎన్నికలప్పుడు పదవి వ్యామోహంతో తిరుగుతుంటారని, మీరే ఆలోచించాలని, అందుబాటులో ఉండి మీ అందరి కుటుంబసభ్యునిగా ఉండే వ్యక్తి నేనన్నారు.
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో వంద శాతం దళితబంధు ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల, పట్టణ అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్, గుండ్ల నాగ య్య, సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ తూము వీరభద్రరావు, సొసైటీ డైరెక్టర్ దగ్గుల రాజశేఖర్‌రెడ్డి, జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ఓబుల సీతరామిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు జీవీఆర్, మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ యూసూఫ్, నాయకులు దూపాటి నరేశ్రాజు, గుండ్ల వెంకటి, ముత్తారెడ్డి, బద్దం కోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, దిరిశాల దాసురావు, ఎండీ బాబు, శీలం శ్రీనివాసరెడ్డి, కాంపాటి శశికుమారి, పమ్మి కృష్ణారావు, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, వరపర్ల ఉద య్, వనిగండ్ల అశోక్, నున్నా తిరుమలరావు, ఎక్కిరాల సుదర్శన్, ఇస్నేపల్లి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు, నవంబర్13: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడి గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, లబ్ధిదారులే ప్రచారకులుగా మారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొస్తారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం కల్లూరులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
మండల పర్యటనలో భాగంగా శాంతినగర్, పెద్దకోరుకొండి గ్రామాలకు చెందిన 50 కుటుంబాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్13: మండలంలోని లింగగూడెం, వీఎం బంజర సోమ్లానాయక్తండా, కోండ్రుపాడు గ్రామాలకు చెందిన పలు పార్టీల పలుకుటుంబాలు ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి సాధరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో లింగగూడెంలో వడ్లముడి కృష్ణయ్య, ఏటుకూరి అప్పారావు, సత్యనారాయణ, గల్లా సురేశ్, వీఎం బంజరలో భూక్యా ప్రసాద్, వంగా గిరిజాపతి, పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ మాజీచైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, నాయకులు లక్కినేని వినీల్, మందడపు అశోక్‌కుమార్, కోటగిరి సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.