ఎర్రుపాలెం, మే 30 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో జమలాపురం రెవెన్యూ సర్వే నంబర్ 58 పరిధిలో సాగు చేస్తున్నప్పటికీ పాస్ పుస్తకాలు అందని రైతుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతుల వద్ద ఉన్న పాత పాస్ పుస్తకాలు, ఇతర ఆధార పత్రాలతో పాటు రెవెన్యూ శాఖ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్, అర్హులైన రైతుల వివరాలను సేకరించి నివేదిక పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కొత్త పాస్ పుస్తకాలు అందని అర్హులైన రైతులను గుర్తించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు త్వరలోనే పాస్ పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఎలిజబెత్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సర్పంచులు బండ్ల రాణి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, ఆర్ఐ రవికుమార్, నాయకులు గుడేటి బాబురావు, యన్నం పిచ్చిరెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బండ్ల ఆత్మ ప్రసాద్, కర్నాటి సుధాకర్ రెడ్డి, శీలం వరప్రసాద్, పిట్టల శివయ్య రైతులు పాల్గొన్నారు.

అర్హులైన రైతులకు త్వరలో పాస్ పుస్తకాలు : జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి