– ఎర్రుపాలెం గురుకుల ప్రిన్సిపాల్ పరమేశ్వరి
ఎర్రుపాలెం, జులై 11 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో శనివారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వి.పరమేశ్వరి తెలిపారు. ఈ ఎన్నికల్లో కమిటీ చైర్మన్గా ఇనగాలికి చెందిన పొట్టపింజర చిట్టిబాబు, వైస్ చైర్మన్గా జమలాపురానికి చెందిన ముల్లంగి పూర్ణిమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా సగ్గుర్తి ముత్యాలరావు, వేల్పుల సుధాకర్, గుడేటి జ్యోతి, ఇనపనూరి కళ్యాణి, ఇనపనూరి ఝాన్సీ, సంగెపు జ్యోతి, సగ్గుర్తి ద్వారక, వెంకటరత్నం, కోట స్వాతి, కొమ్ము ఉదయశ్రీ, తిరుపతమ్మ, కందుకూరి రమ్య, పిల్లలమర్రి స్వాతి, నాగలక్ష్మి, చుక్క జ్యోతి, పులి రాణి, మేరీ ఎన్నికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరమేశ్వరి మాట్లాడుతూ.. పేరెంట్స్ కమిటీ అనేది కేవలం ఒక కమిటీ మాత్రమే కాదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను పాఠశాలతో కలిసి పంచుకునే గొప్ప వేదికగా అలాగే పాఠశాల అభివృద్ధికి మార్గదర్శక శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.