కారేపల్లి : విద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలవాలని పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం (Bajumallaigudem) హైస్కూల్లో పూర్వ విద్యార్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, పాటిమీదగుంపు, నానునగర్‌తండా సర్పంచ్‌లు కోరం కోటమ్మ, మాలోత్ లలిత, గుగులోత్ సుజాత, మాలోత్ విజయకుమారిలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్దులలో ఒకరైన సీఐ పోతుల శ్రీధర్‌ను సైతం సత్కరించారు.
ఈసందర్బంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ బాజుమల్లాయిగూడెం హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణంతోపాటు, అవసరమైన అన్ని మౌళిక వసతుల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో కొందరు పిల్లలను తమవెంట పనికి తీసుకెళ్తున్నారని, ఫలితంగా పిల్లల భవిష్యత్తును నాశనం అవుతుందని, అలా చేయడం చట్ట ప్రకారం నేరమని వారు పేర్కొన్నారు. పిల్లల చదవుపై, ప్రవర్తనపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
సర్పంచ్‌లకు పూర్వవిద్యార్ధుల సన్మానం
అందరి సహకారంతో గ్రామాభివృద్ది, విద్యాభివృద్దికి పాటుపడతామని సర్పంచ్‌లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధులు భూక్యా హాస్మీ, పోతుల శ్రీధర్, వేల్పుల ధన రాజు, గుర్రం హరినాథ్, సిలివేరు రమేష్, గుజ్జర్లపూడి మాధవరావు, జ్యోతుల సోమయ్య, తాటికొండ రాణి, పాటి కిష్టయ్య, మంద అమఅతరావు, దుద్దుకూరి సుమంత్, కల్లోజి సాల్మన్, తదితరులు పాల్గొన్నారు.