సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపడుతోంది. కారేపల్లి (సింగరేణి) మండల వ్యాప్తంగా ఇప్పటికే 176 మంది రైతులు సుమారు 500 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.
కారేపల్లి, అక్టోబర్ 12 : రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపడుతోంది. కారేపల్లి (సింగరేణి) మండల వ్యాప్తంగా ఇప్పటికే 176 మంది రైతులు సుమారు 500 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే పంటలపై రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తోంది. ఈ క్రమంలో సింగరేణి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతు సూరపరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను సోమవారం ఉద్యానవన శాఖ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ముదిగొండ శ్రావణి సందర్శించారు. ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు తమ భూమి వివరాలు, నీటి వసతి, అర్హతలకు సంబంధించిన సమాచారంతో ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే రాయితీలు, ప్రోత్సాహకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

