వైరా: భూసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులకు (Revenue Sadassulu) ప్రజాదారణ కరువైంది. మొదటిరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రం (కారేపల్లి), గిద్దవారిగూడెం, వెంకిట్యాతండాలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణలలో అధికారులు అట్టహాసంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు.
దరఖాస్తుదారుల రాక కోసం అధికారులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. రెవెన్యూ సదస్సులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రచారం చేయకనో లేక ఈ సదస్సుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదనో ప్రజలు మాత్రం సదస్సులు నిర్వహించే వేదిక వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.