ఖమ్మం రూరల్, ఏప్రిల్ 04 : పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయం, ఏదులాపురం మున్సిపాలిటీ రెడ్డిపల్లిలోని మారెమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి పొంగులేటి సూచన మేరకు కమిటీ ఎంపిక జరిగింది. సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా భూక్యా రావోజీ, సభ్యులుగా బోజెడ్ల లలితమ్మ, బండారు నాగేశ్వరరావు, మాలోతు వెంకటేశ్వర్లు, సింగిరెడ్డి బాస్ రెడ్డి, మద్దెల ఉప్పలయ్య, భూక్యా సేవియా నియమితులయ్యారు.
మారెమ్మ తల్లి ఆలయ చైర్మన్గా తిప్పిరెడ్డి వీరారెడ్డి, సభ్యులుగా కుసుమ రాజారాములు, నాగండ్ల ఉపేందర్, భట్టు చలమయ్య, చీకటి శ్రీనివాసరావు, వీర్ల వెంకటేశ్, అజ్మీరా వెంకన్న, కందుల అబ్బిరెడ్డి, బానోతు భాస్కర్, బి.కమలమ్మ, కీర్తి లక్ష్మీనారాయణ, దండి రామారావు ఎంపికయ్యారు. ఏడాది పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. తమపై నమ్మకంతో ఆలయ కమిటీలో చోటు కల్పించిన మంత్రి పొంగులేటికి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.