మధిర, ఆగస్టు 29 : మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దివి సాయి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం, ప్రశస్థి, తెలుగు సాహిత్యాన్ని వ్యవహారిక భాషలో రాయడానికి గిడుగు రామ్మూర్తి విశేష కృషి చేసినట్లు కొనియాడారు.
అలాగే భారతదేశం తరఫున వరుసగా 3 ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించి పెట్టి, భారత హాకీ స్వర్ణ యుగానికి ధ్యాన్ చంద్ నాంది పలికారన్నారు. మహనీయుల కృషి, పట్టుదలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులంతా ధ్యాన్ చంద్ని ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శైలజ, ఎం.మాధవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.