చింతకాని, డిసెంబర్ 10: పీహెచ్సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జాతీయ వైద్య బృంద (ఎన్క్వాస్) పరిశీలకులు జశ్వంత్మాల్, ఎం.కుసుమ ఆదేశించారు. శనివారం వారు చింతకాని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బందికి సూచనలిచ్చారు.
గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యం కోసం వచ్చిన ప్రజలతో వైద్యసేవలపై విచారించారు. ల్యాబ్, ఫార్మసీ, వార్డుల్లో కలియదిరిగారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. వారి వెంట డిప్యుటీ డీఎంహెచ్వో రాంబాబు, వైద్యడు శ్రీకాంత్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు ఉన్నారు.