ఆళ్లపల్లి, సెప్టెంబర్ 18 : నానో యూరియా అలాగే డి.ఎ.పి వల్ల రైతులకు ఎన్నో ఉపయోగాలున్నాయని ఆళ్లపల్లి మండల వ్యవసాయాధికారి అనిల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నానో డీలర్లకు ప్రాక్టికల్ సెషన్ నిర్వహించారు. ఈ సంధర్భంగా రైతులకు డ్రోన్ల ద్వారా పిచికారి విధానాలు, దాని వల్ల చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఇన్పుట్ డీలర్ నరెడ్ల శ్రీను ఆయిల్‌పామ్ తోటలో అంతర పంటగా వేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజ్ జయపాల్, మండల వ్యవసాయ కార్యాలయ సిబ్బంది వంశీ, తాళ్లపల్లి నాగేశ్వర్రావు, బూర్ణ రాంబాబు, బోడ లక్పతి, గుండెబోయిన యాకరాజు పాల్గొన్నారు.