వైరా రూరల్, నవంబర్ 15: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదగాలంటే ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మండలంలోని పాలడుగు, వల్లాపురం, అష్ణగుర్తి, గొల్లెనపాడు, గొల్లపూడి, రెబ్బవరం, జింకలగూడెం, కొష్టాల, తాటిపూడి, సోమవరం గ్రామాల్లో బుధవారం ఆయన తఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తోందని అన్నారు. నియోజకవర్గ ప్రజలే తన బలమూ.. బలగమూ అని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికి చేసిందేమీ లేదని మదన్‌లాల్ విమర్శించారు.
ఇన్నేళ్లలో చేయలేని అభివృద్ధిని ఇప్పుడు చేస్తామంటే నమ్మకమేంటో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, లాల్‌మహ్మద్, ముళ్లపాటి సీతారాములు, కట్టా కృష్ణార్జున్‌రావు, పసుపులేటి మోహన్‌రావు, మేదరమెట్ల రాము, కామినేని శ్రీనివాసరావు, మోరంపూడి ప్రసాద్, వెంకటేశ్వర్లు, రవి, కొత్తా వెంకటేశ్వరరావు, మాదినేని ప్రసాద్, ఏదునూరు శ్రీనివాసరావు, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మేడూరి రామారావు, దొంతెబోయిన గోపి, తన్నీరు కిశోర్, ఆదూరి ప్రేమ్‌కుమార్, తన్నీరు కిశోర్, గుజ్జర్లపూడి దేవరాజు, మాదినేని లక్ష్మణ్, యండ్రాతి గోపాలరావు పాల్గొన్నారు.