ఖమ్మం రూరల్, అక్టోబర్ 6: దుర్గామాత వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఖమ్మంరూరల్ మండలంలోని నాయుడుపేటలో మతభేదాలకు అతీతమైన దృశ్యమొకటి కన్పించింది. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడై ముస్లిం దంపతులు షేక్ సోందుబాబు, సైదాబీ.. మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కులమత భేదం లేకుండా మనమంతా ఒకటేనని చాటిచెప్పిన సోందుబాబు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వినాయకచవితి వేడుకల్లో సైతం సోందుబాబు దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేయడం విశేషం.