ఖమ్మం, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వనసమారాధనతో జిల్లాలోని మున్నూరుకాపుల్లో ఐకమత్యం, రాజకీయ చైతన్యం, సేవాభావం పెంపొందాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన మున్నూరుకాపు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న ఖమ్మం శివారు ప్రకాశ్‌నగర్‌లోని కాళ్ల రామారావు మామిడితోటలో కార్తీకమాస వనమహోత్సవాన్ని నిర్వహించేలా జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానించినట్లు చెప్పారు. ఆ రోజున జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో కాపు సంఘం నాయకులు ఆకుల గాంధీ, శెట్టి రంగారావు, బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, మేకల భిక్షమయ్య, కే.విజయ్‌కుమార్, పసుపులేటి దేవేందర్, వెంకట్, రాపర్తి శరత్, శీలంశెట్టి వీరభద్రం, పొన్నం వెంకటేశ్వర్లు, ఉండీల గంగాధర్, ఆళ్ల కృష్ణ, మలిశెట్టి సతీశ్ పాల్గొన్నారు.
కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
కాపుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దపీట వేస్తోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గుర్తుచేశారు. రాష్ట్రంలో కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపులకు ప్రోత్సాహం అందించినట్లు అవుతుందన్నారు. ఫెడరేషన్ ఏర్పాటు కోసం కాపు ప్రజాప్రతినిధులంతా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఇటీవల కోకాపేటలో కాపు ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసుకున్నామని గుర్తుచేశారు.