కూసుమంచి, అక్టోబర్ 26: ఒకప్పుడు పాలేరు నియోజకవర్గం కరువు ప్రాంతంగా ఉండేదని, సీఎం కేసీఆర్ తనదైన విజన్‌తో ప్రాజెక్ట్‌లు నిర్మించి, సాగుజలాలు వచ్చేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి జీళ్లచెర్వు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా స్థలిని పరిశీలించి అనంతరం విలేకర్లతో మాట్లాడారు. శుక్రవారం జరుగనున్న సీఎం సభకు భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కరువును పారద్రోలిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పాలేరులో పార్టీ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న ఉన్నారు.
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను పార్టీ నా యకులు, ప్రజలు విజయవంతం చేయాలని ప్ర తి గ్రామం నుంచి కార్యకర్తలు కదిలి రావాలన్నా రు. సీఎం కేసీఆర్ విజన్‌తో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. మున్ముందు మరిన్ని పథకాలు అందాలంటే ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావం మోగుతుందన్నారు. సభతో పాలేరు నుంచే శుభారంభం అవుతుందన్నారు. పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తామన్నారు. ఉభయ జిల్లాల పరిధిలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.