కారేపల్లి, అక్టోబర్ 13 : దుకాణం ముందు పెట్టిన మోటర్ సైకిల్ మాయమైన ఘటన ఆదివారం రాత్రి కారేపల్లిలో చోటుచేసుకుంది. కారేపల్లి అంబేద్కర్ సెంటర్లో కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముందు యాజమాని నూకల శ్రీధర్ తన మోటర్ సైకిల్ నిలిపాడు. తెల్లవారి చూచే సరికి షాపు ముందు ఉంచిన వాహనం కనిపించకుండా పోయింది. ఎంత వాకబు చేసినా, వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితుడు కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.