ఖమ్మం, జూన్ 15: గిరిజనుల హకుల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొనియాడారు. ఆదివారం ఖమ్మం నియోజవర్గ కేంద్రంలోని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ నివాసానికి వెళ్లి అతడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. మదన్‌లాల్ భార్య మంజుల, కుమారుడు మృగేందర్‌లాల్, సోదరుడు సుందర్లాల్తో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంలో తనకు మదన్‌లాల్ మృతిచెందిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు ఉప్పలపాటి వెంకటరమణ, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్, వైరా నియోజవర్గ ముఖ్య నాయకులు గిరిబాబు, ముత్యాల వెంకట అప్పారావు, రావూరి శీను, మంగీలాల్, జడల వెంకటేశ్వర్లు, గౌస్, జూలూరుపాడు మాజీ జడ్పీటీసీ కళావతి, పొన్నం హరికృష్ణ, కొత్త వెంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, కిల్లారు కిరణ్, దేవరాజ్, చెల్లా మోహన్‌రావు, జగన్, యలమద్ది రవి, తెలంగాణ ఉద్యమకారులు పగడాల నరేందర్, సతీష్, రసూల్, సద్దాం షేక్, షారుక్, మెదమెట్ల రాము పాల్గొన్నారు.
ఖమ్మంలోని ప్రముఖ కాంట్రాక్టర్ బోడపట్ల వెంకన్న గుండె ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకున్న తాతా మధుసూదన్ ఆదివారం అతడిని పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారి ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పలపాటి వెంకటరమణ, బిచ్చల తిరుమలరావు, పగడాల నరేందర్, రసూల్, లింగన్నబోయిన సతీష్, యలమద్ది రవి, షేక్ సద్దాం, షారుఖ్, అరాఫత్ తదితరులు పాల్గొన్నారు.