కారేపల్లి, అక్టోబర్ 01 : కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వల్లభనేని గురవయ్య సంతాప సభ గురువారం నిర్వహించారు. ఎమ్మెల్సీ తాత మధు హాజరై గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం విద్యుత్ షాక్తో మృతి చెందిన మహిళా రైతు తాత ఉమా కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సైతం గురవయ్య సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సూడా బీఆర్ఎస్ నాయకులు వేణు, ముత్యాల సత్యనారాయణ, పున్నం వీరేందర్, ముత్యాల వెంకట అప్పారావు, రావూరి శ్రీనివాసరావు, రాందాస్, తాత వెంకన్న, వేగ్గలం నాగాచారి పాల్గొన్నారు.

పలు కుటుబాలకు ఎమ్మెల్సీ తాత మధు పరామర్శ