కొత్తగూడెం టౌన్/ పాల్వంచ, జూన్ 21: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. సర్వ మతాల సమానత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా కొత్తగూడెం గణేశ్ టెంపుల్లో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో ఆయన పాల్గొని లక్ష్మీగణపతి హోమం, పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రావు, తాటిపల్లి శంకర్‌బాబు, సులోచన, జయంతి మసూద్, పల్లపు లక్ష్మణ్, దూడల బుచ్చయ్య, మసూద్, మాదా శ్రీరాములు, వెంకటేశ్వర్లు, యాకూబ్, చల్లా భాస్కర్, జానీ, నాగేందర్, రవి, రాజుగౌడ్, రాజశేఖర్, రామన్, అజయ్ నాయుడు పాల్గొన్నారు.
అన్ని మతాలకు సమానం గౌరవం..
అన్ని మతాలకూ సమాన గౌరవం ఇస్తూ ఆయా మతాల ప్రజలు సంక్షేమానికి పాటు పడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పాల్వంచలోని మదీనా మసీదులో ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక నమాజులు ఆచరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నాలుగు మతాల పెద్దలు ఎమ్మెల్యేని సన్మానించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సంజీవరావు, చింతా శ్రీకాంత్, మంజూర్ ఆలీఖాన్, రహమాన్, ఖాజామియా, ముర్తుజా ఆలీఖాన్, రషీద్, యూసఫ్, రహీం, గౌస్, షర్పే ఆలం పాల్గొన్నారు.