తల్లాడ, నవంబర్5: ఎన్నికల అప్పుడు వచ్చిన కనబడి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ పట్టణంలోని బుడగజంగాల, మాలపల్లి, ఎన్టీఆర్కాలనీ తదితర ప్రాంతాల్లో, ముస్లిం మతపెద్దలతో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడు పర్యాయాలు నన్ను గెలిపించి ఆదరించారని, ప్రస్తుత ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా నాకు మీ ఆశీర్వాదం అందించాలని, మీరే నా బలం, బలగం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దూపాటి భద్రరాజు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, బొడ్డు వెంకటేశ్వరరావు, మోదుగు ఆశీర్వాదం, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధం కోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, జీ.వీ.ఆర్, గుండ్ల వెంకటి, వజ్రాల రామిరెడ్డి, యూసూఫ్, చల్లా తిరుమలరావు, చల్లా నాగులు, దూపాటి నరేశ్రాజు, కాంపెల్లి రాము, శెట్టిపల్లి లక్ష్మణరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 5: మండలపాడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. కారు గుర్తుపై ఓటు వేసి సండ్ర వెంకటవీరయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కోట ప్రభాకర్, తేళ్లూరి ఆంజనేయులు, మల్లాది రవి, మధు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి టౌన్, నవంబర్ 5 : సత్తుపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని సత్తుపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. ఆదివారం నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పట్టణంలోని 23, 19 వార్డుల్లో వారు మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి సండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రఫీ, మల్లూరు అంకమరాజు, అమరవరపు విజయనిర్మల, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, నవంబర్ 5: నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు వేంసూరులో ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే సండ్రను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామాల మోహన్‌రావు, యాకూబు, జహీర్, చాంద్‌పాషా, కిన్నెర రాము, మారయ్య తదితరులు పాల్గొన్నారు.