కొత్తగూడెం అర్బన్, మార్చి 13 : జిల్లా కేంద్రంతోపాటు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని, దశలవారీగా నిధులు మంజూరు చేయించుకొని పనులు చేపడుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో రూ.4.95 కోట్ల డీఎంఎఫ్, 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్సు షెల్టర్, పార్కు, టెన్నిస్ కోర్టు, కల్వర్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిపోయిన అభివృద్ధి పనులకు నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. వేసవిలో పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, పుల్లయ్య, శేషాంజన్స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కంచర్ల జమలయ్య, అనిల్, సలిగంటి శ్రీనివాస్, ఫహీం, జహీర్, అజీజ్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.