ఖమ్మం, నవంబర్ 3: తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం, పాలేరు ప్రజలు వద్దు అని ఇంటికి పంపించినా.. ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజలకు పొర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్ధం కావట్లేదని ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. నగరంలో 24, 27వ డివిజన్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరం 24వ డివిజన్ శాంతినగర్ నందు మాజీ గవర్నమెంట్ ఉద్యోగి నరసింహారావు, వారి కుమార్తె నిరోషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఖమ్మం నగరం 27వ డివిజన్ రత్న గార్డెన్స్ నందు ఆర్యవైశ్య చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు మిట్టపల్లి రవి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అజయ్‌కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటికే ప్రజలు ఛీ.. అన్నా మళ్ళీ ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇకడ ప్రజలకు పోర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శి చిన్ని కృష్ణరావు, మెంతుల శ్రీశైలం, వేములపల్లి వెంకన్న, కార్పొరేటర్ మగ్బూల్, ఎన్నికల సమన్వయకర్త సభ్యులు పల్లా రాజశేఖర్, పారా నాగేశ్వరరావు, అమరగాని వెంకన్న, వరద నరసింహారావు, రెహమాన్, తాజ్‌ఉద్దీన్, రామారావు, యర్రా అప్పారావు, పత్తిపాక అప్పారావు, శ్రీదేవి, రజినీ, అరుణ, మాధవి, ఇందిరా తదితరులు ఉన్నారు.
బేగ్‌ను పావుగా వాడుకుని రాజకీయ హత్య చేసిన ఘనుడు తుమ్మల అని మంత్రి, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరం 53వ డివిజన్ లో స్వర్గీయ బుడెన్ బేగ్ కుమారుడు ప్రముఖ వైద్యుడు నియాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంప్‌లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అజయ్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. బేగ్ రాజకీయ జీవితం చిధ్రం చేసిన గోముఖ వ్యాగ్రం తుమ్మల అన్నారు. తుమ్మల తన రాజకీయంలో తను ఎదిగితే చాలు.. అన్న స్వార్థం తప్ప, వేరే ఏ అవకాశం ఇంకొకరికి ఇవ్వలేదన్నారు. కేవలం రాజకీయం కోసమే ఇదంతా చేస్తున్నాడు తప్ప ప్రజలపై ప్రేమతో కాదు.. అని ఇప్పటికైనా ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, కార్పొరేటర్ మగ్బూల్, జహీర్ ఆలీ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, షౌకత్ అలీ, తాజ్ ఉద్దీన్, తిరుమలరావు, వెంకటరమణ, సుబ్బరావు, జగ్గారావు, సలీం, చంద్రకని శ్రీనివాస్, రవి, మురళీ, వీరబాబు, లక్ష్మణ, అబ్బాస్ ఉన్నారు.
ఖహ్మం నగరంలోని 42వ డివిజన్ మజీద్-ఏ-మక్కాలోని మజీద్ నందు శుక్రవారం మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి అజయ్‌కుమార్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మజీద్ ఏ మక్కా నందు తాజుద్దీన్, అబ్దుల్ ముజాయిద్, తౌసిఫ్, షంషిద్దీన్, ఫిరోజ్, సమి, అఫ్సర్ తదితరులు ఉన్నారు.