కారేపల్లి, అక్టోబర్ 27 : కారేపల్లి మండలం మాదారం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుమందు కలిపిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు సోమవారం కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులతో పడని వారు ఈ దుర్ఘటనకు పాల్పడి ఉంటారని బాధితులు తెలిపారు. చెరువులో చేపల మృతితో రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ బైరు గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.