ఖమ్మం, డిసెంబర్ 21 : అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) ఎల్వోసీ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం పంపిణీ చేశారు. ఆయన సిఫార్సు మేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను నగరంలోని వీడీవోస్ కాలనీలో గల క్యాంపు కార్యాలయంలో మంత్రి అందజేశారు. రఘునాథపాలెం మండలం, పాపటపల్లి గ్రామానికి చెందిన పి.విజయకు రూ.2.50 లక్షలు, మధిర నియోజకవర్గం ఇల్లూరు గ్రామానికి చెందిన సీహెచ్ నాగేశ్వరరావుకు రూ.లక్ష, ఖమ్మం నగరానికి చెందిన జి.సుభానికి రూ.59 వేలు మొత్తం రూ.4.09 లక్షల విలువైన ఎల్వోసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ తన సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని, ఆయనకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, మాజీ కార్పొరేటర్ చావా నారాయణరావు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఖమ్మం నగరం వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రజలు తెలుసుకునేందుకు పలు ఫొటోలు, వీడియోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. www.puvvadaAjayKumar .com అనే వెబ్సైట్లో మంత్రి పువ్వాడ బయోగ్రఫీతోపాటు దాదాపు 2వేల కోట్లతో జరిగిన ఖమ్మం అభివృద్ధి పనుల వివరాలను పొందుపర్చారు. మంత్రికి సంబంధించిన పర్యటన వివరాలు, ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని దానిలో వివరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫర్మ్కి సంబంధించిన పువ్వాడ దండు పేరుతో రూపొందించిన లోగోను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.
– కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ