రఘునాథపాలెం, ఆగస్టు 10 : ఖమ్మం అర్బన్ పరిధిలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పర్యటించారు. స్థానిక 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు విజ్ఞప్తి మేరకు డివిజన్లో పర్యటించిన మంత్రి స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకరావడంతో కాలనీ అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఈఈ కృష్ణలాల్, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.