బీజేపీ తెలంగాణకు పట్టిన పీడ అని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 178 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.78 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. నగరంలోని 25వ డివిజన్ మేదర బజార్ బస్తీ దవాఖానలో కంటి వెలుగు వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ1 నిందితుడిగా నిలిచి జైలుకు వెళ్లారన్నారు. ఇలాంటి విధానాలతో బీజేపీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నదన్నారు.
ఖమ్మం ఏప్రిల్ 6 : బీజేపీ నాయకులు నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 178 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.78 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తెలంగాణకు పట్టిన పీడ అని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లుగా అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పాలన అందిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందిస్తున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు టీఎస్పీఎస్సీ, పదోతరగతి పేపర్‌ను లీక్ చేశారని అన్నారు.
ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ1 ము ద్దాయిగా నిలిచి జైలుకు వెళ్లారన్నారు. వేల కోట్ల రూపాయాలు సంక్షేమ పథకాల రూపంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుంటే బీజేపీ, కాం గ్రెస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. చేసిన మంచి పనులు చెప్పుకోవాలి.. లేకపోతే చేయబో యే పనులు చెప్పుకొని రాజకీయాలు చేయాలి కాని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయనే కేసీఆర్, కేటీఆర్‌ను బద్నాం చేసేందుకే బీజేపీ ఇలాంటి దా రుణాలకు పాల్పడుతుందని విమర్శించారు.
సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి భారం తగ్గిందన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఆర్డీవో రవీంద్రనాథ్, నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్లు షేక్ మక్బుల్, నీరజ, కోటి, అమృతమ్మ, నిరీష, జ్యోతిరెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.