కల్లూరు, జనవరి 6: రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన రూ.5.50 కోట్లతో నిర్మించిన చెన్నూరు-రంగాపురం రహదారిని రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి, పాలేరు, అశ్వారావుపేట, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.
ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకం ఏదైనా అమలైతే దాని అమలు ఎలా ఉందో తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ మొదట కాల్ చేసేది ఎమ్మెల్యే సండ్రకేనన్నారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు అసూయ పడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూ రాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సభ్యులు చందర్రావు, రఘు, సొసైటీ చైర్మన్లు నర్వనేని అంజయ్య, వెంకటేశ్వరరావు, సర్పంచ్ పాలెపు లక్ష్మీకాంతమ్మ, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఎంపీటీసీలు, డీసీసీబీ డైరెక్టర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తయ్యాకే ఓట్లు అడుగుతా : ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేశాకే వచ్చే ఎన్నికలకు ఓట్లు అడుగుతానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 80శాతం గ్రామాల్లో సీసీ రోడ్లు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ బీటీ రోడ్లు నిర్మించామన్నారు. మంత్రుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో చెన్నూరు- ఎర్రబోయినపల్లి బీటీ రోడ్డు, చిన్నకోరుకొండి- ఆర్లపాడు రోడ్లు పూర్తి చేస్తానన్నారు. కల్లూరు పట్టణంలో రోడ్డు విస్తరణ చేపట్టి డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానన్నారు. ఫిబ్రవరిలో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రూ.11 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి నాటికి మినీ స్టేడియం పూర్తి చేసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా ప్రారంభిస్తామన్నారు.