ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ రఘునాథపాలెం, ఏప్రిల్ 19: అభివృద్ధి ప్రదాత మంత్రి అజయ్‌కుమార్ అని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి, మరిన్ని బర్త్‌డేలు జరుపుకొని జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించాయి. రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానలు నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. అన్నదానాలు, రక్తదానాలు, పండ్ల పంపిణీలు, కేక్ కటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, చికుళ్ల వెంకటేశ్, కొమ్ము విజేత, సతీశ్, సాయి కిరణ్, ప్రశాంత్, కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్లో ప్రముఖ వ్యాపారి, టీఆర్ఎస్ నాయకుడు యర్రా అప్పారావు ఆధ్వర్యంలో దాదాపుగా 1500 మందికి అల్పహారం పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న దంపతులు మంత్రి దంపతులను కలిసి మెమెంటో అందజేశారు. మమత హాస్పిటల్లో ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పువ్వాడ నరెన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మమత సంస్థల సెక్రటరీ జయశ్రీ, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, ఆళ్ల నిరీష, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో డ్రైవర్లకు చొక్కాలు పంపిణీ చేశారు. జక్కుల వెంకటరమణ ఆధ్వర్యంలో మదర్ థెరిసా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మంత్రి పీఏ కిరణ్, పుటిపాటి ప్రసాద్, లింగాల రవికుమార్, పాల్వంచ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ రఘునాథపాలెం మండలం మహిళా అధ్యక్షురాలు బానోతు ప్రమీల ఆధ్వర్యంలో రోటరీనగర్‌లో కేక్‌ను కట్ చేశారు. క్యాంపు కార్యాలయంలో మంత్రికి పుష్పగుచ్ఛం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. 5వ డివిజన్ టీఆర్ఎస్ నేతలు సలవాది వెంకన్న, కోలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బల్లేపల్లి మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. పంచాయితీల సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మందడపు నర్సింహారావు, వీరూనాయక్, లక్ష్మణ్ నాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, కొర్లపాటి రామారావు, చెరుకూరి ప్రదీప్, నున్నా శ్రీనివాసరావు, నున్నా వెంకటేశ్వర్లు, శివలాల్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా నగరంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లోసతీమణి వసంతలక్ష్మి, కుమారుడు నయన్రాజ్లతో కలిసి మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేశారు. కార్పొరేటర్లు కమర్తపు మురళి, రాపర్తి శరత్, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.