భద్రాచలం, జనవరి 24 : గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ కచ్చితంగా అమలు చేయాలని, పౌష్ఠికాహారం అందిస్తే మంచి ఆరోగ్యంతో ఉన్నత చదువులను అభ్యసిస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ మైనార్టీ పాఠశాల, కళాశాల అడ్మిషన్ల బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కళాశాల అడ్మిషన్ల కోసం దరఖాస్తు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ముందుగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్‌లాల్ హట్కర్, అధ్యాపకులు, టీచర్లు ఆయనకు బ్యాండ్ మేళం, పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా, వైద్యానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 5వ తరగతిలో ప్రవేశాల కోసం, మైనార్టీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో హెచ్ఈసీ, సీఈసీల్లో 80 సీట్లు ఉన్నాయని ఆసక్తి గల వారు ఆన్లైన్లో https://tmreistelangana. cgg.gov.in/ TMREIS మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.