దమ్మపేట, సెప్టెంబర్ 16: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీ వైజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్కలగండి, అంకంపాలెం, పెద్దగొల్లగూడెం, చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలల వద్ద డెయిలీ వైజ్ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం ఐదో రోజుకు చేరింది.
పార్కలగండి దీక్షా శిబిరానికి చేరుకున్న మెచ్చా వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెయిలీ వైజ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని, కొత్త మెనూ వల్ల పెరిగిన పని భారానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డా రమేశ్, దారా యుగంధర్, రావుల శ్రీను, జలగం వాసు, సోడెం గంగరాజు, రెడ్డిమల్ల నాగయ్య, మొగిలి కృష్ణ, వెంపటి భరత్, మల్లేష్, కాక శంకరప్రసాద్, నరేంద్ర, రంగ, వెంకటేశ్వరరావు, భీమరాజు, సూరి చలపతిరావు, మాజీ ఎంపీటీసీ కోర్స శ్రీను, మాజీ సర్పంచ్ కోర్స వెంకటేశ్వరరావు, పూనెం గోపాలరావు పాల్గొన్నారు.