మక్కలు బుగ్గిపాలు
మండలంలోని పాతర్లపాడులో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరిత్యం కారణంగా రైతులకు రూ.లక్షల పంటనష్టంతోపాటు మూగజీవాల ప్రాణనష్టం కలిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపాడు గ్రామంలోని రైతులు మొకజొన్న పంటను సాగు చేసి, నెలరోజుల క్రితమే కాంటాలు వేసి బస్తాల్లో నింపి కల్లాల్లోనే ఉంచారు.
- పాతర్లపాడులో భారీ అగ్నిప్రమాదం
- కాలిబూడిదైన మొకజొన్న బస్తాలు
- 200 క్వింటాళ్లకుపైగా మక్కలు దగ్ధం
- కాంటాలు వేసినా తరలించని ప్రభుత్వం
- మంటల్లో చిక్కుకొని 30 గొర్రెలు మృతి
- రైతులు, గొర్రెల యజమానుల కంటతడి
చింతకాని, మే 3: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరిత్యం కారణంగా రైతులకు రూ.లక్షల పంటనష్టంతోపాటు మూగజీవాల ప్రాణనష్టం కలిగింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపాడు గ్రామంలోని రైతులు మొకజొన్న పంటను సాగు చేసి, నెలరోజుల క్రితమే కాంటాలు వేసి బస్తాల్లో నింపి కల్లాల్లోనే ఉంచారు. లారీలు వస్తాయని, పంటను తరలిస్తారని రోజులు తరబడి ఎదురుచూసినా అధికారుల నుంచి ఎటువంటి స్పందనలేదు.
ఈక్రమంలో సమీపంలోని ఎండిపోయిన మొకజొన్న దంటుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. అదే సమయంలో వీచిన పెనుగాలుల ధాటికి మంటలు వేగంగా వ్యాపించి కల్లాల్లో నిల్వ ఉన్న మొకజొన్న బస్తాలను చుట్టుముట్టాయి. ఈ అగ్నిప్రమాదంలో రైతులకు తీవ్రనష్టం జరగడంతో సుమారు 200 క్వింటాళ్లకు పైగా మక్కలు పూర్తిగా బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకొని 30 గొర్రెలు సైతం మృతిచెందాయి. అదే గ్రామానికి చెందిన ఒబినబోయిన వీరబాబు గొర్రెలు 15, చెవుల పుల్లయ్య గొర్రెలు 15 అకడికకడే మృతిచెందాయి.
మరో 20కి పైగా గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. రైతుల పైపులైన్లు, విద్యుత్ వైర్లు, బోరు మోటర్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విపత్తుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాధితులు మండిపడుతున్నారు. ఎంత దిగుబడి వస్తుందో అధికారులకు ముందే తెలుసునని, కాంటాలు వేసిన తర్వాత లారీలు లేవు.. గోదాములు లేవు అంటూ కాలయాపన చేయడం వల్లే ఈ స్థితి సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకో గొర్రెలకాపరికి రూ.2 లక్షలకు పైగా నష్టంవాటిల్లడంతో వారు దికుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు.

Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

