సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంట్లో రిసెప్షన్ సందడి నెలకొంది. సండ్ర కుమారుడు భార్గవ్ – చిద్విత సాయిల వివాహం ఇటీవల హైదరాబాద్‌లో జరుగగా.. ఖమ్మంలోని శ్రీలక్ష్మీ గార్డెన్స్‌లో ఆదివారం రిసెప్షన్ నిర్వహించారు.
ఈ వేడుకకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
-రఘునాథపాలెం, అక్టోబర్ 20