కారేపల్లి, జులై 23 : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయనీ వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశమునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి బానోత్ మంజుల మదన్ లాల్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
బుధవారం ఆమె నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లోతట్టు ప్రాంత వాసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అధికార యంత్రాంగం తక్షణమే స్పందించాలని కోరారు.