ఖమ్మం: ఖమ్మం నగరంలో (Khammam) దారుణం చోటుచేసుకున్నది. భార్యపై అనుమానంతో గొంతు కోసి చంపేశాడు. చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల సాయివాణి, భర్త భాస్కర్‌కు మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలో అద్దెకు ఉంటున్నది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భాస్కర్ గురువారం తెల్లవారుజామున సాయివాణిపై కత్తితో దాడిచేశాడు.
గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అడ్డుకోబోయిన కుమార్తె హర్షవర్ధినికి కూడా గాయాలయ్యాయింది. దీంతో దవాఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.