కూసుమంచి (నేలకొండపల్లి), డిసెంబర్ 31: భక్తరామదాసు సర్వీస్ సొసైటీ మాజీ అధ్యక్షులు, అరవిందా స్కూల్ డైరెక్టర్, ముజ్జుగూడెం గ్రామానీకి చెందిన నెల్లూరి వీరబాబు(55) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మంలో నివాసముంటున్న వీరబాబు స్వగ్రామం ముజ్జుగూడెంలో మంగళవారం ఉదయం పొలం వద్దకు వచ్చిన తరువాత గుండె నొప్పి రావడంతో పక్కన వారికి తెలపడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కొసం ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరబాబు మృతిపట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సీతారాములు, బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, శాఖమూరి రమేశ్, సాధు రాధాకృష్ణ మూర్తి, భక్త రామదాసు సర్వీస్ సొసైటీ బాధ్యులు సంతాపం తెలిపారు.