ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14 : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన సోమవారం సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల గ్రామానికి చెందిన చెరుకుపల్లి నరసింహారావు (47) ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీగా తన విధులు ముగించుకుని తన వాహనంపై వెంకటగిరి నుంచి గుడిమల్ గ్రామానికి బయల్దేరాడు.
మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి పడిపోవడంతో నరసింహారావు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతుడు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.