రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానించడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో మాలమహానాడు నేతలు ఆయన దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. చండ్రుగొండలో మాల మహానాడు నాయకులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
జూలూరుపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పాల్వంచలో నల్ల బ్యాడ్జీలు ధరించి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నేతలు నివాళులర్పించారు.
-చండ్రుగొండ/ జూలూరుపాడు/ పాల్వంచ టౌన్/ కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 20